Andhra News: ఎస్వీబీసీ ఛానల్‌ నిర్వహణ రాజకీయ నాయకులకెందుకు?: సోము

ఎస్వీబీసీ ఛానల్‌లో సినిమా పాటలు ప్రసారమవుతున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 23 Apr 2022 11:54 IST

తిరుపతి: ఎస్వీబీసీ ఛానల్‌లో సినిమా పాటలు ప్రసారమవుతున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తితిదే ఆధ్వర్యంలోని ఛానల్‌ నిర్వహణ రాజకీయ నాయకులకు ఎందుకు అని ప్రశ్నించారు. తిరుపతిలో సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. 

‘‘భక్తులకు వసతులు కల్పించాల్సిన బాధ్యత తితిదేది. ఇటీవల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన నిర్ణయాలకు ముందు అందరితో చర్చించాలి. ధర్మప్రచారానికి తితిదే బడ్జెట్‌లో ఎంత కేటాయిస్తున్నారు. ధర్మ ప్రచార కార్యక్రమాలు పూర్తిగా ఆగిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా తితిదే వేద పాఠశాలలు ఏర్పాటు చేయాలి. ధర్మప్రచార నిధులు ఎస్వీబీసీ ఛానల్‌కు 80శాతం కేటాయిస్తున్నారు. ఎస్వీబీసీ ఛానల్‌లో సినిమా పాటలు ప్రసారమవుతున్నాయి. 

ప్రభుత్వ అక్రమాలపై ప్రశ్నిస్తే నోటీసులు జారీ చేస్తున్నారు. తినే బియ్యం ఎందుకు ప్రజలకు ఇవ్వడం లేదు. అక్రమాలు జరగకుండా నగదు ఇస్తామనడం దారుణం. మిల్లర్లు, అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి అక్రమాలు చేస్తున్నారు. ఇసుక మాఫియా పెరిగిపోయింది. సత్యవేడు, కాళహస్తి, సూళ్లూరుపేట నుంచి చెన్నైకు తరలిస్తున్నారు. తమిళనాడుకు ఇసుక అక్రమ రవాణా వెంటనే ఆపాలి’’ అని సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని