Telangana News: సీఎంను ప్రజలే పట్టించుకోవట్లేదు.. భాజపా సైతం పట్టించుకోదు: బండి సంజయ్‌

తెలంగాణ రాష్ట్రంలో మార్పు కోసం భాజపా పనిచేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు.

Published : 26 Jun 2022 15:27 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో మార్పు కోసం భాజపా పనిచేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. ఒక్కసారి తమ పార్టీకి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలను కోరారు. భాజపా కట్టడికి సీఎంవోలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ను ప్రజలే పట్టించుకోవట్లేదని.. భాజపా కూడా పట్టించుకోదని తెలిపారు. పులి వస్తే జింక పారిపోయినట్లు కేసీఆర్‌ పారిపోతున్నారని విమర్శించారు. జులై 3న సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో భాజపా నిర్వహించే భారీ బహిరంగ సభ ఏర్పాటు పనులను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘జులై 3న సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ ఏర్పాటుచేస్తున్నాం. సభను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తున్నాం. తెలంగాణలో పార్టీ పాలసీలను ప్రకటించడానికి, ప్రజల్లో చైతన్యం చేయడానికి సభ ఏర్పాటు చేస్తున్నాం. 10 లక్షల మందిని సభకు తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ మేరకు బూత్‌ నుంచి రాష్ట్రస్థాయి నేతల వరకు సమావేశాలు నిర్వహించాం. జన సమీకరణ కోసం కమిటీలు వేశాం. భాజపా కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా సభకు తరలిరావాలి’’ అని సంజయ్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని