Botsa satyanarayana: అంగన్వాడీల జీతాలపై మేం అలా చెప్పలేదు: మంత్రి బొత్స సత్యనారాయణ

తెలంగాణ ప్రభుత్వం పెంచిన ప్రతిసారి అంగన్వాడీలకు జీతాలు పెంచుతామని తాము చెప్పలేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

Updated : 29 Dec 2023 18:45 IST

విజయనగరం: అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం జీతాలు పెంచిన ప్రతిసారీ తామూ పెంచుతామని చెప్పలేదని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa satyanarayana) స్పష్టం చేశారు. వైకాపా (YSRCP) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.1000 పెంచుతామని హామీ ఇచ్చామని.. ఆ మేరకు మొదటి ఏడాది రూ.11వేలు చేసినట్లు చెప్పారు. ఇప్పుడు కూడా అంగన్వాడీల పది డిమాండ్లు అంగీకరించామని.. అయితే, ఎన్నికలకు వెళ్తున్నామని.. సమయం లేని కారణంగా అర్థం చేసుకోవాలని కోరినట్లు చెప్పారు. విజయనగరంలో మంత్రి మాట్లాడారు.

వైకాపా హామీల అమలుపై తెదేపా (TDP) రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల్లో అభ్యర్థుల మార్పులు, చేర్పులు సహజమన్నారు. స్థానిక పరిణామాలు, పరిస్థితులు, సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఏ రాజకీయ పార్టీ అయినా మార్పులు చేయడం సహజంగా జరిగేదేనన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిల వచ్చినా వైకాపాకు ఎలాంటి నష్టం లేదన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్‌పై చర్చలు జరుగుతున్నాయని.. రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. విజయనగరం ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేల పనితీరు బాగుందని మార్పు ఉండబోదనే నమ్మకాన్ని బొత్స వ్యక్తం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని