MLC Kavitha: మహిళల బాధను స్మృతి ఇరానీ విస్మరించారు: కవిత

మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇచ్చే ప్రతిపాదనను.. కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) వ్యతిరేకించడం నిరుత్సాహపరిచిందని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారం వ్యక్తం (Kavitha Kalvakuntla) చేశారు.

Updated : 15 Dec 2023 12:53 IST

హైదరాబాద్‌: మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇచ్చే ప్రతిపాదనను.. కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) వ్యతిరేకించడం నిరుత్సాహపరిచిందని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారం వ్యక్తం (Kavitha Kalvakuntla) చేశారు. ఒక మహిళగా ఆమె అలాంటి వాఖ్యలు చేయడం సరికాదన్నారు.

‘‘నెలసరి సమయంలో మహిళలు పడే బాధను గమనించి సెలవు మంజూరు చేయాలని కోరాల్సింది పోయి.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ దాన్ని కొట్టిపారేయడం విచారం కలిగించింది. మహిళల బాధ పట్ల ఇలాంటి నిర్లక్ష్యాన్ని చూడాల్సి వస్తున్నందుకు మహిళగా బాధపడుతున్నా. నెలసరి మనకున్న ఎంపిక కాదు. అదొక సహజమైన జీవ ప్రక్రియ. వేతనంతో కూడిన సెలవును తిరస్కరించడం అసంఖ్యాకమైన మహిళల బాధను విస్మరించినట్లే’’ అని కవిత్‌ ఎక్స్‌ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని