Pralhad Joshi: కేటీఆర్‌.. కవిత.. భాజపాలోకి ఎవరొచ్చినా ఆహ్వానిస్తాం: కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఇంటిపై దాడి ఘటనపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో భాజపా ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేకనే భాజపా నేతల ఇళ్లపై కేసీఆర్‌ ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందని విమర్శించారు.

Published : 18 Nov 2022 16:27 IST

హైదరాబాద్: తెలంగాణలో భాజపా ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేకనే భాజపా నేతల ఇళ్లపై కేసీఆర్‌ ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి విమర్శించారు. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఇంటిపై దాడి ఘటనపై కేంద్ర మంత్రి తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న భాజపా.. తెరాస ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. భాజపాలోకి కేటీఆర్‌, కవిత ఎవరు వచ్చినా సాధరంగా ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు.

‘‘ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణకు వస్తే సీఎం కేసీఆర్‌ ఎందుకు ముఖం చాటేస్తున్నారు? తను చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికే కేసీఆర్ అలా చేస్తున్నారా? మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. సీఎం కేసీఆర్ అబద్ధాలకు అడ్డులేకుండా పోతోంది. గనులపై ఒడిశా రాష్ట్రం మంచి లాభాన్ని గడిస్తుంటే.. తెలంగాణలో గనుల నుంచి వచ్చే రాబడిని సద్వినియోగం చేసుకోవడం లేదు. పీఎం ఆవాస్ యోజన పథకాన్ని సైతం తెలంగాణ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేకపోతోంది’’ అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని