Chandrababu: వైకాపా.. ఫేక్‌ పరిశ్రమను తెరపైకి తెచ్చింది: చంద్రబాబు

జగన్‌ను ఇంటికి పంపాలని ప్రజలు నిర్ణయించటంతో.. ఫేక్‌ పరిశ్రమను వైకాపా తెరపైకి తెచ్చిందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. 

Updated : 11 Apr 2024 15:47 IST

అమరావతి: జగన్‌ను ఇంటికి పంపాలని ప్రజలు నిర్ణయించటంతో.. ఫేక్‌ పరిశ్రమను వైకాపా తెరపైకి తెచ్చిందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. గురువారం పార్టీ ముఖ్యనేలతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘‘సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వీడియోలతో గందరగోళం సృష్టిస్తున్నారు. ఈటీవీ విశ్వసనీయత దెబ్బతీసేలా ఆ ఛానెల్‌ పేరుతో వైకాపా ఫేక్‌ వీడియోలు సృష్టిస్తోంది. ప్రజలు నమ్మే వార్తా ఛానెల్‌ పేరుతో తప్పుడు వీడియోలు ప్రచారం చేస్తున్నారు.

ఆ వీడియోలు చూసి ప్రజలు నమ్మేస్తారనే దుస్థితికి దిగజారారు. వైకాపా ఫేక్‌ ప్రచారాలను దీటుగా తిప్పికొట్టాలి. ఫేక్‌ ప్రచారానికి కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరోను కూడా వదలట్లేదు. సూపర్‌ సిక్స్‌ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలి. వాలంటీర్లను బానిసలుగా మార్చి ఊడిగం చేయించుకున్నారు. వారితో తప్పుడు పనులు చేయించి జైలుకు పంపాలని చూస్తున్నారు. వాలంటీర్లకు రూ.10వేలు ఇస్తామంటే ఇప్పుడు తట్టుకోలేకపోతున్నారు. కూటమి అభ్యర్థులకు 3 పార్టీల ఓట్లు పడేలా నాయకులు చూడాలి’’ అని సూచించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని