UP elections: ‘మేం ఉద్యోగాలు ఎలా ఇస్తామంటే’.. యూత్ మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్‌

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ కొత్త అస్త్రాలు సిద్ధం చేసింది. యూత్‌ మేనిఫెస్టో పేరిట యువతపై హామీల వర్షం కురిపించింది.

Updated : 21 Jan 2022 16:01 IST

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ కొత్త అస్త్రాలు సిద్ధం చేసింది. యూత్‌ మేనిఫెస్టో పేరిట యువతపై హామీల వర్షం కురిపించింది. శుక్రవారం దిల్లీలోని ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో ఈ మేనిఫెస్టోను విడుదల చేసింది. యువతకు తమ పార్టీ ఎలా ఉపాధి కల్పిస్తుందో తెలియజేయడమే ఈ యూత్ మేనిఫెస్టో వెనకున్న ఆలోచనని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ అన్నారు.

‘‘ఉద్యోగాలు ఇవ్వడం మాట పక్కన పెడితే.. ఇప్పటి ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి గంటకు 880 మంది యువత ఉద్యోగాలు కోల్పోతున్నారు. 16 లక్షల మంది యువత ఉపాధి కోల్పోయారు. ఎందుకంటే.. ఇద్దరు, ముగ్గురు పారిశ్రామికవేత్తలకే అన్ని పనులూ అప్పగిస్తున్నారు. మేం ఉద్యోగాలు ఎలా సృష్టించగలమో యూపీ యువతతో మాట్లాడిన తర్వాత నిర్ణయించుకున్నాం’’ అని రాహుల్ గాంధీ అన్నారు. ‘‘మేం విద్వేషాన్ని వ్యాప్తి చేయం. ప్రజలను ఏకం చేస్తాం. యువ బలంతో కొత్త ఉత్తర్‌ప్రదేశ్‌ను సృష్టించాలనుకుంటున్నాం’’ అని అధికార పార్టీపై విమర్శలు చేశారు. 

‘‘యువత అనుభవిస్తున్న సమస్యల్ని మేం చూశాం. నైపుణ్యాలు ఉండి, ఉద్యోగం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని పార్టీలూ వచ్చి మేం 25 లక్షలు, 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానాలు చేస్తుంటాయి. కానీ ఎలా ఇస్తాయో మాత్రం వివరించలేదు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆ వివరణ ఇచ్చింది’’ అని ప్రియాంక గాంధీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

హామీల్లో కొన్ని..

* అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందులో 8 లక్షల ఉద్యోగాలు మహిళలకు కేటాయిస్తున్నట్లు పేర్కొంది.  

ప్రాథమిక పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 1.5 లక్షల ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ

రూ.5 వేల కోట్లతో ‘సీడ్‌ స్టార్టప్‌ ఫండ్’ ఏర్పాటు. స్టార్టప్‌లు ప్రారంభించే 30 ఏళ్లులోపు వారికి ప్రాధాన్యం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని