Chidambaram: అలా అయితే.. గోవాను దేవుడే కాపాడాలి: పి.చిదంబరం

మరికొన్ని నెలల్లో గోవాలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో అధికారం దక్కించుకునేందుకు పార్టీలన్నీ ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ(టీఎంసీ) ప్రకటించిన ఓ హామీపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం వ్యంగ్యంగా విమర్శించారు. తొలిసారిగా

Published : 13 Dec 2021 01:10 IST

పనాజీ: మరికొన్ని నెలల్లో గోవాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో అధికారం దక్కించుకునేందుకు పార్టీలన్నీ ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ(టీఎంసీ) ప్రకటించిన ఓ హామీపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం వ్యంగ్యంగా విమర్శించారు. తొలిసారిగా గోవాలో పోటీ చేయబోతున్న టీఎంసీ మహిళల ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకునేందుకు ‘గృహలక్ష్మీ’ పథకాన్ని ప్రకటించింది. ఆ పార్టీకి చెందిన మహువా మోయిత్రా మీడియాతో మాట్లాడుతూ.. టీఎంసీ అధికారంలోకి వస్తే ఈ పథకం కింద ప్రతి ఇంట్లోని మహిళ బ్యాంకు ఖాతాలో ప్రతి నెలా రూ. 5వేలు జమ చేస్తామని వెల్లడించారు. 

దీంతో గోవా ఎన్నికల ఇంఛార్జిగా ఉన్న పి.చిదంబరం.. టీఎంసీ హామీపై ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ ‘‘ఆర్థికశాస్త్రంలో నోబెల్‌ బహుమతికి అర్హమైన లెక్క ఇది. గోవాలోని 3.5 లక్షల కుటుంబాల్లోని ఒక్కో మహిళ ఖాతాకు నెలకు రూ.5వేలు చొప్పున జమ చేస్తే.. ప్రభుత్వానికి నెలకు రూ. 175 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే సంవత్సరానికి రూ.2,100 కోట్లు. 2020 మార్చి నాటికి రూ. 23,473 కోట్ల రుణభారం ఉన్న గోవా రాష్ట్రానికి ఇది ‘చిన్న’ మొత్తమే. గోవాను దేవుడు ఆశీర్వదించాలి. లేదా దేవుడే కాపాడాలి’’అని ట్విట్టర్‌లో ఎద్దేవా చేశారు.

చిదంబరం చేసిన ట్వీట్‌కు గోవా టీఎంసీ నేత మహువా మోయిత్రా సమాధానం ఇచ్చారు. ‘అవును సర్, 3.5 లక్షల గోవా కుటుంబాలు రూ.5వేల చొప్పున ఇస్తే రూ. 2,100 కోట్లు ఖర్చవుతుంది. అయితే, ఆ మొత్తం రాష్ట్ర బడ్జెట్‌లో 6-8 శాతం మాత్రమే. ఇది ఖచ్చితంగా చేయదగినది. కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ మెరుగవ్వాలంటే ప్రజల చేతిలో నగదు ఉండాల్సిన అవసరముంది’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Read latest Political News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని