BJP: రూ.15 లక్షల కోట్ల ఆదాయం ఎలా చూపించారు?: పురందేశ్వరి

చేసిన అప్పులకు.. తప్పులకు వైకాపా ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వ్యాఖ్యానించారు. 

Published : 01 Aug 2023 22:22 IST

అమరావతి: చేసిన అప్పులకు.. తప్పులకు వైకాపా ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి దాటి అప్పులు చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘‘ఆస్తుల తనఖా, మద్యం ఆదాయం చూపించి అప్పులు చేస్తున్నారు. అన్నీ కలిపి రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్లు అప్పు ఉంది. ఏపీ అప్పులను నిర్మలా సీతారామన్‌కు రాతపూర్వకంగా వివరించాం. కరోనా వల్ల రూ.40వేల కోట్లు అదనంగా అప్పు తీసుకునేందుకు కేంద్రం అవకాశం కల్పించింది.  అలాంటప్పుడు ఆర్‌బీఐకి రూ.15 లక్షల కోట్ల ఆదాయం ఎలా చూపించారు?’’ అని పురందేశ్వరి ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని