Purandeswari: త్వరలో పవన్‌కల్యాణ్‌తో భేటీ: పురందేశ్వరి

ఏపీలో ఉన్నన్ని కోర్టు ధిక్కార కేసులు ఏ రాష్ట్రంలోనూ లేవని భాజపా (BJP) ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) ఎద్దేవా చేశారు.

Updated : 19 Jul 2023 13:27 IST

అమరావతి: ఏపీలో ఉన్నన్ని కోర్టు ధిక్కార కేసులు ఏ రాష్ట్రంలోనూ లేవని భాజపా (BJP) ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) ఎద్దేవా చేశారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏపీని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉందని చెప్పారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 

త్వరలో జనసేన (Janasena) అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan)తో భేటీ అవుతానని పురందేశ్వరి చెప్పారు. పొత్తులపై పార్టీ అధిష్ఠానం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. త్వరలో తాను జోన్ల వారీగా పర్యటించి నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతానని చెప్పారు.  

Pawan Kalyan: మూడు పార్టీలు కలుస్తాయనే ఆశిస్తున్నా

‘‘ఏపీలోని ఆర్థిక పరిస్థితిని కేంద్ర ఆర్థికమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. నాలుగేళ్లలో జగన్‌ ప్రభుత్వం రూ.7.14లక్షల కోట్ల మేర అప్పు చేసింది. అనధికార అప్పులే రూ.4లక్షల కోట్లకుపైగా ఉన్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అని పురందేశ్వరి డిమాండ్‌ చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని