తొలితరం ప్రజానేతను తెలంగాణ కోల్పోయింది: మాజీ ఎంపీ సోలిపేట మృతిపై కేసీఆర్ సంతాపం

మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి (92) కన్నుమూశారు. అస్వస్థతతో ఇవాళ ఉదయం రామచంద్రారెడ్డి తుది శ్వాస విడిచారు. రామచంద్రారెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు.

Updated : 27 Jun 2023 09:48 IST

హైదరాబాద్‌: మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి (92) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. రామచంద్రారెడ్డి మృతిపై సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఆయన జీవితం ఆదర్శం: సీఎం 

తొలితరం కమ్యూనిస్టు నేతగా, నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న సోలిపేట జీవితం ఆదర్శవంతమైందని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఆయన రాజకీయ జీవితంలో సర్పంచ్‌ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రజా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన క్రమం రేపటి తరానికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. సిద్దిపేట ప్రాంత వాసిగా, రాజకీయ సామాజిక రంగాల్లో ఆయన ఆచరించిన కార్యాచరణ.. ప్రజా జీవితంలో కొనసాగుతున్న ఎందరో నేతలకు ప్రేరణగా నిలిచిందన్నారు. రామచంద్రారెడ్డి మరణంతో తెలంగాణ మరో తొలితరం ప్రజానేతను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఇవాళ సాయంత్రం రామచంద్రారెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని