కేంద్ర హోంమంత్రికి తెదేపా ఎమ్మెల్యే లేఖ

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ లేఖ రాశారు. శాంతియుతంగా నిరసన తెలిపిన వారిని అక్రమంగా అరెస్టు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం కుట్రలు చేస్తోందని పేర్కొన్నారు.

Updated : 14 Jan 2020 14:18 IST

రేపల్లె: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే (తెదేపా) అనగాని సత్యప్రసాద్‌ లేఖ రాశారు. శాంతియుతంగా నిరసన తెలిపిన వారిని అక్రమంగా అరెస్టు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం కుట్రలు చేస్తోందని పేర్కొన్నారు. నిరసన తెలిపేందుకు టెంట్లు వేసుకోవడానికి కూడా పోలీసులు అనుమతించడంలేదన్నారు. అమ్మవారి గుడికి వెళ్లే మహిళలను కూడా అడ్డుకొని పోలీసులు చితకబాదారని లేఖలో పేర్కొన్నారు. మహిళలను రాత్రి 8గంటల వరకు పోలీస్‌స్టేషన్లలో అక్రమంగా నిర్బంధించారన్నారు. ప్రభుత్వం పోలీసుల ద్వారా రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని