ఏపీ శాసన మండలిలో మళ్లీ గందరగోళం

ఏపీ శాసన మండలిలో మళ్లీ గందర గోళం నెలకొంది. రూల్‌ 71 కింద చర్చ ప్రారంభించాలంటూ తెదేపా సభ్యులు నినాదాలు చేశారు. తొలుత దీనిపై చర్చ చేపట్టిన తర్వాతే మిగతా అంశాలపై చర్చించాలని...

Updated : 21 Jan 2020 17:55 IST

అమరావతి: ఏపీ శాసన మండలిలో మళ్లీ గందర గోళం నెలకొంది. రూల్‌ 71 కింద చర్చ ప్రారంభించాలంటూ తెదేపా సభ్యులు నినాదాలు చేశారు. తొలుత దీనిపై చర్చ చేపట్టిన తర్వాతే మిగతా అంశాలపై చర్చించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై వైకాపా సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇది సంప్రదాయానికి విరుద్ధమని.. ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులపై మొదట చర్చ చేపట్టాలని పట్టుబట్టారు. తెదేపా సభ్యులకు సంఖ్యాబలం ఎక్కువగా ఉండటంతో రూల్‌ 71 కింద చర్చకు ఛైర్మన్‌ షరీఫ్‌ అనుమతిచ్చారు. ఈ క్రమంలో తెదేపా సభ్యుడు రాజేంద్రప్రసాద్‌ చర్చను ప్రారంభించగా వైకాపా సభ్యులు అడ్డుకున్నారు. మంత్రులు సైతం ఛైర్మన్‌ పోడియం వద్దకు వచ్చి ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులపై చర్చించాలని నినాదాలు చేశారు. మధ్యలో మంత్రి బొత్స కల్పించుకుని ఛైర్మన్‌ తెదేపాకు అనుకూలంగా వ్యవహరించడం సరికాదని అభ్యంతరం తెలిపారు. తెదేపా సభ్యులు చెప్పినట్లే ఛైర్మన్‌ నడుచుకుంటే రూల్‌ బుక్‌, నిబంధనలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇరుపక్షాల నినాదాలతో సభలో గందరగోళం నెలకొంది. 

ఇవీ చదవండి..

మండలి రద్దు యోచనలో ప్రభుత్వం?

మండలి రద్దుచేస్తామంటే భయపడేది లేదు: లోకేశ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని