ఎన్‌పీఆర్‌ సేకరణలో కొత్త ప్రశ్నలొద్దు: నితీశ్

పట్నా: జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్‌)ను గతంలో నిర్వహించిన మాదిరిగానే చేపట్టాలని బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ కేంద్రానికి సూచించారు. పట్నాలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎన్‌పీఆర్‌ సేకరణలో భాగంగా పలు కొత్త ప్రశ్నలను చేర్చడం వల్ల ప్రజలు గందరగోళానికి గురయ్యే

Published : 29 Jan 2020 00:33 IST

పట్నా: జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్‌)ను గతంలో నిర్వహించిన మాదిరిగానే చేపట్టాలని బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ కేంద్రానికి సూచించారు. పట్నాలో ఆయన మాట్లాడుతూ ఎన్‌పీఆర్‌ సేకరణలో భాగంగా పలు కొత్త ప్రశ్నలను చేర్చడం వల్ల ప్రజలు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ‘2011లో ఎన్‌పీఆర్‌ను ఏ విధంగా చేశారో అలానే ఇప్పుడూ చేయాలి. ఇందులో కొత్త ప్రశ్నలు చేర్చకూడదు. తల్లిదండ్రుల పుట్టినతేదీలు అడగటం వంటివి చేస్తే ప్రజలు గందరగోళానికి గురవుతారు. పాత పద్ధతినే అనుసరించడం మంచిది’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

కొత్తగా నిర్వహించే ఎన్‌పీఆర్‌లో 21 కొత్త ప్రశ్నలను చేర్చనున్నారు. సదరు పౌరుడి ఆధార్‌ నెంబరు, ఓటర్‌ ఐడీ, పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ నెంబరు, ఫోన్‌ నెంబరు, తల్లిదండ్రులు పుట్టిన ప్రదేశం, తేదీ, చివరిగా వాళ్లు ఎక్కడ నివసించారు అనే వివరాలను సేకరించనున్నారు. ఇటువంటి వివరాలు తెలుసుకోవడం వల్ల ప్రయోజనమేమీ లేదని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. సీఏఏ, ఎన్నార్సీని సీఎం నితీశ్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ రెండింటినీ బిహార్‌లో అమలు చేసేది లేదని స్పష్టం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని