సీఏఏపై వెనకడుగు వేయం: కేంద్రమంత్రి

గతేడాది పార్లమెంట్‌ ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తేల్చిచెప్పారు. ఈ చట్టాన్ని.......

Published : 28 Feb 2020 00:34 IST

దిల్లీ: గతేడాది పార్లమెంట్‌ ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తేల్చిచెప్పారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్లను ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. గురువారం ఆదాయపుపన్ను అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ సర్క్యూట్‌ ప్రారంభోత్సవంలో మాట్లాడిన రవిశంకర్‌.. మతపరమైన హింసకు గురై పాకిస్థాన్‌, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్‌ల నుంచి వచ్చే వాళ్లకు భారత పౌరసత్వం ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలని ప్రశ్నించారు. సీఏఏను వ్యతిరేకించేవాళ్లను ఒప్పించేందుకు ప్రయత్నిస్తామన్న ఆయన.. నిద్రపోయేవాళ్లను లేపడం సులభమే గానీ.. నిద్ర నటించేవాళ్లను మేల్కొల్పడం ఎవరితరమూ కాదని వ్యాఖ్యానించారు. అన్ని మతాల ప్రజలు శాంతియుతంగా కలిసిమెలిసి జీవించడమే భారతదేశ విలక్షణీయత అని వ్యాఖ్యానించారు. మరోవైపు, సీఏఏ ఆందోళనలతో ఈశాన్య దిల్లీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఇప్పటివరకు దాదాపు 35 మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గాయపడిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని