‘ప్రత్యేకంగా అసెంబ్లీ సీట్ల పెంపు అవకాశం లేదు’

తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా అసెంబ్లీ సీట్ల పెంపు అవకాశం లేదని, దేశవ్యాప్తంగా జరిగినప్పుడే ఈ ప్రక్రియ ఉంటుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ...

Published : 28 Feb 2020 00:34 IST

స్పష్టం చేసిన కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి

దిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా అసెంబ్లీ సీట్ల పెంపు అవకాశం లేదని, దేశవ్యాప్తంగా జరిగినప్పుడే ఈ ప్రక్రియ ఉంటుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్పష్ట చేశారు. సీట్ల పెంపు అంశం ప్రస్తుతం పెండింగ్‌లో ఉందని.. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన చెప్పారు. విభజన చట్టంలో ఇష్టం వచ్చినట్లు అంశాలు పెట్టారని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. జమ్మూకశ్మీర్‌ అభివృద్ధికి కేంద్ర సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించామని చెప్పారు. మే నెలలో మరోసారి కశ్మీర్‌ వెళ్లి అవుట్‌ రీచ్‌ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కశ్మీర్‌ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ‘‘కశ్మీర్‌కు ప్రత్యేక ప్యాకేజీ కింద బడ్జెట్‌లో రూ.30 వేల కోట్లు కేటాయిస్తాం. కశ్మీర్‌ ప్రజల సహకారంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ఏప్రిల్‌, మే నెలల్లో జమ్మూ కశ్మీర్‌లో పర్యటిస్తాను. దిల్లీలోనూ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. హింసకు పాల్పడి.. ఆస్తులు ధ్వంసం చేసిన వారిపై కేసులు నమోదు చేస్తాం. అల్లర్లకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని