కొనసాగుతున్న డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ డీసీఎంఎస్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్ల ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు అంతటా ఏకగ్రీవమయ్యే

Updated : 29 Feb 2020 11:31 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ డీసీఎంఎస్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్ల ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు అంతటా ఏకగ్రీవమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే తెరాస అధిష్ఠానం మంత్రులకు సీల్డు కవర్లలో పేర్లు అందజేసింది. మంత్రులు ఈ పేర్లను వెల్లడిస్తున్నారు. మహబూబ్‌నగర్‌ డీసీసీబీ ఛైర్మన్‌గా నిజాం పాషా, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌గా ప్రభాకర్‌ రెడ్డి పేర్లు ఖరారయ్యాయి. ఖమ్మం డీసీసీబీ ఛైర్మన్‌గా నాగభూషణం, డీసీఎంస్‌ ఛైర్మన్‌గా శేషగిరిరావు ఏకగ్రీవమయ్యారు. ఆదిలాబాద్‌ డీసీసీబీ ఛైర్మన్‌గా నాందేవ్‌ కాంబ్లే, డీసీఎంస్‌ ఛైర్మన్‌గా లింగయ్య పేర్లు ఖరారయ్యాయి. వరంగల్‌ డీసీసీబీ ఛైర్మన్‌గా రవీందర్‌రావు, డీసీఎంస్‌ ఛైర్మన్‌గా రామస్వామి నాయక్‌, నిజామాబాద్‌ డీసీసీబీ ఛైర్మన్‌గా పోచారం భాస్కర్‌రెడ్డి, డీసీఎంస్‌ చైర్మన్‌గా మోహన్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని