సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌ పర్యటన వాయిదా

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం నాటి  కరీంనగర్ పర్యటన వాయిదా పడింది. దేశవ్యాప్తంగా ప్రబలుతున్న కరోనా వైరస్ నివారణలో భాగంగా.. రాష్ట్ర ప్రజల్లో మరింత భరోసాను నింపేందుకు శనివారం సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌ పర్యటనకు సిద్ధమయ్యారు.

Updated : 21 Mar 2020 09:34 IST

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం నాటి  కరీంనగర్ పర్యటన వాయిదా పడింది. దేశవ్యాప్తంగా ప్రబలుతున్న కరోనా వైరస్ నివారణలో భాగంగా.. రాష్ట్ర ప్రజల్లో మరింత భరోసాను నింపేందుకు శనివారం సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌ పర్యటనకు సిద్ధమయ్యారు. తాజాగా ఇండోనేషియా నుంచి వచ్చిన కొందరి వల్ల స్థానికులు ఎవరూ కరోనా బారినపడకుండా ఉండేందుకు ఇప్పటికే నగరాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై నగరంలో భారీస్థాయిలో స్క్రీనింగు, తదితర ఏర్పాట్లు చేపట్టింది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, వైద్యశాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి తదితరుల సూచనల మేరకు.. ఏర్పాట్లకు ఆటంకం కలగకుండా ఉండేందుకు శనివారం సీఎం కరీంనగర్ పర్యటన వాయిదా వేశారు. 

 ఈ విషయమై శుక్రవారం నాడు ముఖ్యమంత్రి అటు రాష్ట్రంతో  సహా కరీంనగర్ లో జరుగుతున్న వైద్య ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పోలీస్ కమీషనర్లతో పలు మార్లు ఆరాతీసారు.  కరీంనగర్లో జరుగుతున్న ఏర్పాట్ల విషయంలో వారు సీఎంకు భరోసానివ్వడంతో  పాటు  పర్యటన వాయిదా చేసుకోవాలని కోరడంతో.. సీఎం పర్యటన వాయిదా పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని