గాంధీ కుటుంబానికి అర్థం కాని విషయమిది!

ప్రస్తుతం అధికారంలో ఉన్నది మన్మోహన్‌సింగ్‌ తరహా ప్రభుత్వం కాదని గాంధీ కుటుంబం అర్థం చేసుకోలేకపోతోందని కేంద్రమంత్రి ముక్తార్‌ అక్బాస్‌ నఖ్వీ అన్నారు. ఇది రిమోట్‌ కంట్రోల్‌తో నియంత్రించేది కాదని విమర్శించారు....

Published : 30 Jun 2020 00:34 IST

విద్రోహులకు సహాయపడే ప్రశ్నలు అడుగుతున్నారు: నఖ్వీ

రాంపూర్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌): ప్రస్తుతం అధికారంలో ఉన్నది మన్మోహన్‌సింగ్‌ తరహా ప్రభుత్వం కాదని గాంధీ కుటుంబం అర్థం చేసుకోలేకపోతోందని కేంద్రమంత్రి ముక్తార్‌ అక్బాస్‌ నఖ్వీ అన్నారు. ఇది రిమోట్‌ కంట్రోల్‌తో నియంత్రించేది కాదని విమర్శించారు.

పీఎం కేర్స్‌ నిధికి చైనా కంపెనీలు విరాళం అందజేశాయని ఇది దేశభద్రతకు ముప్పని కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వి చేసిన విమర్శలను నఖ్వీ తిప్పికొట్టారు. ‘ఇప్పుడున్నది రిమోట్‌ కంట్రోల్‌తో నియంత్రించే మన్మోహన్‌ సింగ్‌ తరహా ప్రభుత్వం కాదని గాంధీ కుటుంబం అర్థం చేసుకోలేకపోతోంది. దేశ భద్రత, అభివృద్ధికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అంకితమైంది. కాంగ్రెస్‌ పాఠాలు చెప్పడం మానేయాలి. ప్రస్తుతం ఫొటో ఫ్రేమ్‌కు పరిమితమైన కాంగ్రెస్‌ పార్టీ క్షేత్రస్థాయి వాస్తవాలను అంగీకరించలేదు’ అని ఆయన విమర్శించారు.

‘కాంగ్రెస్‌కు జ్ఞానం కొరవడింది. భారత్‌కు ముప్పు కలిగించే శక్తులకు ప్రాణవాయువు అందించే ప్రశ్నలే ప్రతి రోజూ అడుగుతోంది. వారు దేశ ప్రతిష్ఠను మసకబారుస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. గందరగోళంలోకి నెట్టేస్తున్నారు. భారత విద్రోహ శక్తులు తమ అసాంఘిక కార్యకలాపాల కోసం కాంగ్రెస్‌ను ఉపయోగించుకొనే అవకాశం ఉంది’ అని నఖ్వీ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని