BJP: మే 14న తెలంగాణ రాజకీయాల్లో మార్పు రాబోతుంది : భాజపా నేత ప్రభాకర్‌

రాష్ట్రంలో నేరాలు పెరుగుతున్నా.. పోలీసులు ఎందుకు నియంత్రించలేకపోతున్నారని భాజపా నేత ఎన్వీఎస్‌ ప్రభాకర్‌ ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Published : 11 May 2022 15:12 IST

హైదరాబాద్: రాష్ట్రంలో నేరాలు పెరుగుతున్నా.. పోలీసులు ఎందుకు నియంత్రించలేకపోతున్నారని భాజపా నేత ఎన్వీఎస్‌ ప్రభాకర్‌ ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘దేశంలో ఎక్కడ ఏం జరిగినా.. దానికి సంబంధించిన మూలాలు తెలంగాణలో బయటపడుతున్నాయి. తెరాస, మజ్లీస్‌ స్నేహం వల్లే అనేక అసాంఘిక శక్తులకు రాష్ట్రం అడ్డగా మారిపోయింది. తెలంగాణకు అసలు హోంమంత్రి ఉన్నారా..?’’ అని ఆయన ప్రశ్నించారు.

‘మే 14న రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రాబోతుంది. బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ చరిత్రను సృష్టించబోతుంది. ఎనిమిదేళ్ల తెరాస పాలనలో కేసీఆర్ ప్రజలను వంచించారు. బహిరంగ సభా వేదికగా కేసీఆర్‌ను రైతు, యువజన, దళిత ద్రోహిగా నిలబెట్టబోతున్నాం. తెరాస సర్కార్‌పై సకల జనులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ధనిక రాష్ట్రంలో ప్రజల ఆస్తులను ప్రభుత్వం అమ్ముకుంటూ పోతోంది. ప్రజా ద్రోహి కేసీఆర్ గద్దె దిగాలి. కేసీఆర్ ఎన్నికలకు ఎప్పుడు వెళ్లినా భాజపా సిద్ధం’’ అని ప్రభాకర్‌ ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని