EC: కేసీఆర్‌కు వ్యతిరేకంగా భాజపా ప్రచారానికి ఈసీ బ్రేక్‌!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా భాజపా చేపట్టిన ప్రచారానికి బ్రేక్‌ పడింది. ‘సాలు దొర.. సెలవు దొర’ పేరుతో కౌంట్‌డౌన్‌ మొదలైందంటూ

Updated : 11 Aug 2022 16:52 IST

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా భాజపా చేపట్టిన ప్రచారానికి బ్రేక్‌ పడింది. ‘సాలు దొర.. సెలవు దొర’ పేరుతో కౌంట్‌డౌన్‌ మొదలైందంటూ భాజపా చేపట్టిన ప్రచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)నిలుపుదల చేసింది. ఆ ప్రచారంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఎం అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ కేసీఆర్‌ ఫొటోలతో పోస్టర్లు ముద్రించేందుకు భాజపా అనుమతి కోరగా ఎన్నికల సంఘం నిరాకరించింది.

ఇటీవల కాలంలో తెలంగాణలో తెరాస- భాజపా మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు ఎక్కువయ్యాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రధాని మోదీపై తెరాస నేతలు విమర్శలు చేస్తుంటే.. తెరాస ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై భాజపా నేతలు ప్రతి విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన సందర్భంలో ఆయనపై విమర్శలతో పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. ఆ తర్వాత కేసీఆర్‌పైనా పలు ఆరోపణలు చేస్తూ కొన్ని చోట్ల పోస్టర్లు కనిపించిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని