శ్రీవాణి ట్రస్టు నిధులు రూ.650 కోట్లు ఏమయ్యాయి?

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో శ్రీవాణి ట్రస్టుకు వచ్చిన రూ.650 కోట్లు ఎక్కడెక్కడ ఖర్చు చేశారో, ఏవేం ఆలయాలు నిర్మించారో శ్వేతపత్రం విడుదల చేయాలని తెదేపా రాష్ట్ర కార్యదర్శి పంచుమర్తి అనురాధ డిమాండు చేశారు.

Published : 25 Jan 2023 05:42 IST

తెదేపా రాష్ట్ర కార్యదర్శి పంచుమర్తి అనురాధ డిమాండ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో శ్రీవాణి ట్రస్టుకు వచ్చిన రూ.650 కోట్లు ఎక్కడెక్కడ ఖర్చు చేశారో, ఏవేం ఆలయాలు నిర్మించారో శ్వేతపత్రం విడుదల చేయాలని తెదేపా రాష్ట్ర కార్యదర్శి పంచుమర్తి అనురాధ డిమాండు చేశారు. ‘రూ.3096 కోట్ల బడ్జెట్‌లో దేనికి ఎన్ని కేటాయిస్తున్నారు? భక్తులిచ్చే విరాళాల లెక్కలు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? గదుల అద్దెలు, లడ్డూ ధర పెంచారు. ఈ డబ్బులన్నీ ఎవరు స్వాహా చేస్తున్నారు?’ అని ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ‘వైకాపా పాలనలో తితిదే కుంభకోణాలమయంగా మారింది. శ్రీవారికి కానుకల రూపంలో నిత్యం కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటే.. భక్తుల్ని ఇబ్బంది పెట్టేలా ధరలు పెంచడమేంటి?’ అని మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని