నా ప్రాణాలంటే ముఖ్యమంత్రికి లెక్కలేదా?
‘‘నా ప్రాణానికి తీవ్రవాద సంస్థల నుంచి ముప్పు పొంచి ఉందని ప్రభుత్వ అధికారులే చెబుతున్నారు. నాకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ చెడిపోతున్నా కొత్తది ఇవ్వకుండా దాన్నే తూతూమంత్రంగా మరమ్మతులు చేయించి పంపిస్తున్నారు.
వీడియో సందేశంలో మండిపడ్డ ఎమ్మెల్యే రాజాసింగ్
ధూల్‌పేట, న్యూస్‌టుడే: ‘‘నా ప్రాణానికి తీవ్రవాద సంస్థల నుంచి ముప్పు పొంచి ఉందని ప్రభుత్వ అధికారులే చెబుతున్నారు. నాకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ చెడిపోతున్నా కొత్తది ఇవ్వకుండా దాన్నే తూతూమంత్రంగా మరమ్మతులు చేయించి పంపిస్తున్నారు. అంటే దీని అర్థం.. రాజాసింగ్ బతికితే ఏంటి? చనిపోతే ఏంటి? అనే భావనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు భావించాల్సి వస్తోంది’’ అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు గురువారం రాత్రి ఒక వీడియో విడుదల చేశారు. ‘‘రెండురోజుల కిందట నా బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయించింది. షెడ్‌కు తీసుకువెళ్లిన సిబ్బంది నిన్న తిరిగి అదే వాహనాన్ని పంపారు. పాడైన వాహనాన్ని ఎందుకు పంపిస్తున్నారని పైఅధికారులతో మాట్లాడితే.. దాన్నే మరమ్మతు చేసి పంపాలని పైనుంచి ఆదేశాలున్నాయి అని ఒక అధికారి అన్నారు’’ అని రాజాసింగ్ అందులో పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
TSPSC: పేపర్ లీకేజీ కేసు.. ముగ్గురికి 14 రోజుల రిమాండ్
-
Sports News
Virat Kohli-RCB: విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేస్తాడు: ఆకాశ్ చోప్రా
-
World News
US Visa: బిజినెస్, పర్యాటక వీసాపైనా ఇంటర్వ్యూలకు హాజరవ్వొచ్చు
-
Movies News
Nagababu: ‘ఆరెంజ్’ రీ రిలీజ్.. వసూళ్ల విషయంలో నాగబాబు వినూత్న నిర్ణయం
-
General News
TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో మరో ఇద్దరికి అధిక మార్కులు.. సిట్ దర్యాప్తులో వెల్లడి
-
India News
Vijay Mallya: అప్పు చెల్లించకుండా.. విదేశాల్లో మాల్యా ఆస్తులు కొనుగోలు: సీబీఐ