అమిత్‌ షాను ఆపలేకపోయిన వర్షం!

క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా గడిపే నాయకుడు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా. అలాంటి వ్యక్తి సమయం కుదుర్చుకుని బహిరంగ సభ కోసం నగరానికి వచ్చినప్పటికీ వర్షం కారణంగా అందులో పాల్గొనలేకపోయారు.

Published : 30 Jan 2023 06:32 IST

ఫోను ద్వారా బహిరంగ సభలో ప్రసంగం

గోహానా: క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా గడిపే నాయకుడు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా. అలాంటి వ్యక్తి సమయం కుదుర్చుకుని బహిరంగ సభ కోసం నగరానికి వచ్చినప్పటికీ వర్షం కారణంగా అందులో పాల్గొనలేకపోయారు. అయినా కార్యకర్తలు నిరుత్సాహపడకుండా ఉండేందుకు ఫోనులోనే సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సంఘటన హరియాణాలోని గోహానాలో ఆదివారం జరిగింది. ఇక్కడి బహిరంగ సభలో పాల్గొనడానికి షా ఆదివారం రాష్ట్రానికి చేరుకున్నా.. భారీ వర్షం మొదలవడంతో ఫోనులోనే తన ప్రసంగాన్ని వినిపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు