జీడీపీ పెరిగితే అప్పులెందుకు చేస్తున్నారు?

జీడీపీలో రాష్ట్రం దేశానికే దిక్సూచి అని చెబుతున్న ముఖ్యమంత్రి రోజువారీ అప్పులు ఎందుకు చేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

Published : 01 Feb 2023 04:00 IST

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజం

టెక్కలి, న్యూస్‌టుడే: జీడీపీలో రాష్ట్రం దేశానికే దిక్సూచి అని చెబుతున్న ముఖ్యమంత్రి రోజువారీ అప్పులు ఎందుకు చేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర జీడీపీ పెరిగితే తలసరి ఆదాయంలో అట్టడుగున ఎందుకు ఉందని నిలదీశారు. నోరు విప్పితే ముఖ్యమంత్రి అబద్ధాలే చెబుతారని తూర్పారబట్టారు. రూ.10 లక్షల కోట్ల అప్పు చేసిన ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలకు కేవలం రూ.1.5 లక్షల కోట్లే వేశారని, మిగిలిన రూ.8.5 లక్షల కోట్లు ఎటు వెళ్లాయో చెప్పాలని నిలదీశారు. ముఖ్యమంత్రి చేతకాని తనంతో కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టులు ఒక్కటీ పూర్తి కాలేదని, పోలీసులపై తాను చేసిన వ్యాఖ్య స్థానికంగా ఉపయోగించే సాధారణ మాటని, అయినా పోలీసులు అపార్థం చేసుకున్నందున క్షమాపణ చెప్పానని వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు