భారాస, భాజపాల మధ్య రహస్య ఒప్పందం

భారాస, భాజపాల మధ్య రహస్య ఒప్పదం ఉన్నందునే ఆ రెండు పార్టీలు మద్యం కుంభకోణం, అదానీ ఆస్తులపై శాసనసభలో చర్చించడం లేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్కుమార్‌ ఆరోపించారు.

Published : 06 Feb 2023 03:27 IST

ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌

పెగడపల్లి, న్యూస్‌టుడే: భారాస, భాజపాల మధ్య రహస్య ఒప్పదం ఉన్నందునే ఆ రెండు పార్టీలు మద్యం కుంభకోణం, అదానీ ఆస్తులపై శాసనసభలో చర్చించడం లేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్కుమార్‌ ఆరోపించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా ఆదివారం ఆయన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని సుద్దపల్లి, బతికెపల్లి, నామాపూర్‌, కీచులాటపల్లి, ల్యాగలమర్రి, ఏడుమోటలపల్లి, పెగడపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఆ రెండు పార్టీలూ బీసీలకు అన్యాయం చేస్తున్నాయన్నారు. కాళేశ్వరం పథకం మూడో టీఎంసీ పనుల్లో భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లించడం లేదని ధ్వజమెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని