ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు.. రాష్ట్రంలో మార్పునకు నాంది: కంచర్ల శ్రీకాంత్‌

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు రాష్ట్రంలో మార్పునకు శ్రీకారం చుట్టి తెదేపాకు ఘన విజయం అందించారని తూర్పు రాయలసీమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన కంచర్ల శ్రీకాంత్‌ అన్నారు.

Updated : 20 Mar 2023 06:21 IST

తిరుమల, న్యూస్‌టుడే: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు రాష్ట్రంలో మార్పునకు శ్రీకారం చుట్టి తెదేపాకు ఘన విజయం అందించారని తూర్పు రాయలసీమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన కంచర్ల శ్రీకాంత్‌ అన్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆయన రాష్ట్ర పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ‘నా విజయాన్ని నారా లోకేశ్‌కు అంకితమిస్తున్నా.  విజయానికి సహకరించిన తెదేపా కార్యకర్తలు, పట్టభద్రులు, ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. వైకాపా ప్రభుత్వ పాలనతో ప్రజలు విసిగిపోయారు. రాష్ట్ర భవిష్యత్తును కాపాడగలిగే నాయకుడు చంద్రబాబేనని నమ్మారు. సీఎం జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులలో సైతం తెదేపాకు మంచి మద్దతు లభించింది’ అని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని