నేడు సీపీఎం జనచైతన్య యాత్ర ముగింపు

సీపీఎం చేపట్టిన జనచైతన్య యాత్ర బుధవారం హైదరాబాద్‌లో ముగుస్తుంది. ధర్నాచౌక్‌ వద్ద జరిగే ముగింపు సభకు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌ కారాట్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

Published : 29 Mar 2023 05:29 IST

హాజరుకానున్న ప్రకాశ్‌ కారాట్‌

ఈనాడు, హైదరాబాద్‌: సీపీఎం చేపట్టిన జనచైతన్య యాత్ర బుధవారం హైదరాబాద్‌లో ముగుస్తుంది. ధర్నాచౌక్‌ వద్ద జరిగే ముగింపు సభకు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌ కారాట్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మార్చి 17 నుంచి రాష్ట్రంలో మూడు ప్రాంతాల నుంచి మూడు యాత్రలు ప్రారంభమయ్యాయి. ఈ మూడు బైక్‌ ర్యాలీలతో మంగళవారం హైదరాబాద్‌ చేరుకుంటాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రారంభమైన యాత్రలు మంగళవారం సాయంత్రానికి హైదరాబాద్‌ శివారుకు, నగరానికి చేరుకున్నాయి. మొదటి యాత్ర బుధవారం తుర్కయాంజాల్‌ మీదుగా ధర్నాచౌక్‌ చేరుకుంటుంది. రెండోది ఈసీఐఎల్‌ చౌరస్తా నుంచి.. మూడోది చాంద్రాయణగుట్ట నుంచి ధర్నాచౌక్‌కు వస్తాయి. ఉదయం 11.30 గంటలకు ముగింపు సభ ప్రారంభమవుతుందని సీపీఎం తెలిపింది. రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సహా ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు