తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు మీరాకుమార్‌

కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జూన్‌ 2న నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలకు లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ మంగళవారం తెలిపారు.

Published : 31 May 2023 03:49 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జూన్‌ 2న నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలకు లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ మంగళవారం తెలిపారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు నిజాం కాలేజీ ఎదురుగా ఉన్న బాబుజగ్జీవన్‌రామ్‌ విగ్రహం నుంచి అబిడ్స్‌, ఎంజే మార్కెట్‌ మీదుగా గాంధీభవన్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ ర్యాలీని మీరాకుమార్‌ ప్రారంభిస్తారని, అనంతరం గాంధీభవన్‌లో జరిగే సభలో ప్రసంగిస్తారని వెల్లడించారు.  


మోదీ పాలనలో రూ.వేల కోట్ల కుంభకోణాలు

జి.నిరంజన్‌

కేంద్ర ప్రభుత్వం 9 ఏళ్ల పాలనలో సాధించిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేసే పేరుతో భాజపా.. మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌ కార్యక్రమం చేపట్టడం హాస్యాస్పదమని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 9 ఏళ్ల పాలనలో అభివృద్ధికి బదులుగా వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు.


మభ్యపెట్టడానికే ధరణిపై సానుకూల ప్రచారం

కోదండరెడ్డి

అనేక లోటుపాట్లున్న ధరణి పోర్టల్‌పై తమకు అనుకూలంగా ఉన్న వారితో ప్రభుత్వం సానుకూల ప్రచారం చేయించుకుంటోందని కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి విమర్శించారు. రైతులను మభ్యపెట్టడానికి అసత్య ప్రచారం చేస్తోందన్నారు. ఇప్పటివరకు 15 లక్షల మంది రైతుల భూముల వివరాలు ఆన్‌లైన్‌లో ఎక్కలేదన్నారు. ఈ పోర్టల్‌కు మాజీ సీఎస్‌ సోమేశ్‌కుమారే కారణమని, ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేందుకే కేసీఆర్‌ ఆయనను పక్కన కూర్చోబెట్టుకుంటున్నారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని