తెదేపా మేనిఫెస్టో అంటే జగన్‌కు భయమెందుకు?

తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్‌ వంటి అసమర్థ సీఎం మరెవరూ ఉండరని తెదేపా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ విమర్శించారు.

Published : 02 Jun 2023 04:49 IST

మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌

ఈనాడు-అమరావతి: తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్‌ వంటి అసమర్థ సీఎం మరెవరూ ఉండరని తెదేపా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ విమర్శించారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. ‘అన్ని వర్గాలకు భరోసా కల్పిస్తూ.. చంద్రబాబు మేనిఫెస్టో ప్రకటించారు. అది ప్రజల్లోకి వెళితే జగన్‌కు, ఆయన పార్టీకి పుట్టగతులుండవన్న భయంతోనే వారు ఇష్టానుసారం అబద్ధాలు చెబుతున్నారు. విజనరీ నాయకుడు చంద్రబాబు ఆలోచనలు, ప్రిజనరీ జగన్‌కు ఏం తెలుస్తాయి? నాలుగేళ్లలో ఎవరికి న్యాయం చేశారో సీఎం సమాధానం చెప్పాలి. పేదల్ని మరింత దిగజార్చేలా ఆయన పాలన సాగింది. తన బాబాయ్‌ హత్యపై సీఎం ఏం చెబుతారా అని ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కుటుంబానికి న్యాయం చేయలేని వ్యక్తి, రాష్ట్ర ప్రజలను ఎలా ఉద్ధరిస్తాడు? చంద్రబాబు, లోకేశ్‌ దర్జాగా ప్రజల్లో తిరుగుతుంటే, సీఎం మాత్రం పరదాల మధ్య నుంచి, పోలీసుల సాయంతో ప్రజల్లోకి వెళ్తున్నారు’ అని రాజేంద్రప్రసాద్‌ విమర్శించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని