నెలలో ఎనిమిది రోజులు క్షేత్రస్థాయిలో ఉండాలి

నెలలో ఎనిమిది రోజులు నియోజకవర్గంలో కచ్చితంగా ఉండాలని...క్షేత్రస్థాయిలో పర్యటించి పార్టీని బలోపేతం చేయాలని తెదేపా నియోజకవర్గ పరిశీలకులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు సూచించారు.

Published : 03 Jun 2023 02:54 IST

నియోజకవర్గ పరిశీలకులతో చంద్రబాబు సమీక్ష

ఈనాడు డిజిటల్‌, అమరావతి: నెలలో ఎనిమిది రోజులు నియోజకవర్గంలో కచ్చితంగా ఉండాలని...క్షేత్రస్థాయిలో పర్యటించి పార్టీని బలోపేతం చేయాలని తెదేపా నియోజకవర్గ పరిశీలకులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు సూచించారు. వర్గ విభేదాలను వారి స్థాయిలో పరిష్కరించాలని తెలిపారు. ప్రతి 15 రోజులకోసారి నియోజకవర్గంలో పార్టీ సంస్థాగత స్థితిగతులపై రాష్ట్ర స్థాయిలో సమీక్షించాలని నిర్ణయించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకులతో చంద్రబాబు శుక్రవారం సమీక్షించారు. ‘‘ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి. తొలి మేనిఫెస్టోపై ప్రచారం చేయాలి. మహిళలకు అవగాహన కల్పించాలి. ఈ నెల పది నుంచి ప్రారంభించనున్న భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో నిర్వహించాలి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి పుల్లారావు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, ఎమ్మెల్యే సత్యప్రసాద్‌ పాల్గొన్నారు.

తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని అభిలషిస్తూ ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని