పేదల కోసమైతే సర్కారు భూములు లేవా?
‘దళితులకు మూడెకరాలు ఇవ్వడానికి భూములుండవు. పేదల సంక్షేమానికి సర్కారీ భూములు కనిపించవు. కానీ, భారాస పార్టీ రెండో భవనానికి మాత్రం కారుచౌకగా భూములు లభిస్తాయి’ అని వైతెపా అధ్యక్షురాలు వైఎస్.షర్మిల మంగళవారం విమర్శలు గుప్పించారు.
పార్టీకి కారుచౌకగా 11 ఎకరాలా?: షర్మిల
ఈనాడు, హైదరాబాద్: ‘దళితులకు మూడెకరాలు ఇవ్వడానికి భూములుండవు. పేదల సంక్షేమానికి సర్కారీ భూములు కనిపించవు. కానీ, భారాస పార్టీ రెండో భవనానికి మాత్రం కారుచౌకగా భూములు లభిస్తాయి’ అని వైతెపా అధ్యక్షురాలు వైఎస్.షర్మిల మంగళవారం విమర్శలు గుప్పించారు. ‘రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు కేసీఆర్ రాజకీయాలకు భూములు కరవా? భారత్ భవన్ పేరుతో 15 అంతస్తుల్లో ఎక్స్‌లెన్స్ సెంటర్ నిర్మిస్తారట. రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీకి రెండు కార్యాలయాలా? పార్టీ పేరు మార్చినంత మాత్రాన కొత్త భవనానికి సర్కారు భూమి కేటాయించడమేమిటి? బహిరంగ మార్కెట్లో రూ.550 కోట్లు పలికే 11 ఎకరాల స్థలాన్ని రూ.37 కోట్లకే కొట్టేశారు. 36 లక్షల మందికి రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి భూములు దొరకవు. అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలు, ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించడానికి మాత్రం ప్రభుత్వానికి జాగాలు కనిపించవు’ అని ఆమె ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Revanth Reddy: కాంగ్రెస్‌లోకి మరిన్ని చేరికలు ఉంటాయి: రేవంత్‌రెడ్డి
-
Suryakumar Yadav: ఇన్నాళ్లూ తికమక పడ్డా.. నా కొత్త పాత్రను ఇష్టపడుతున్నా: సూర్యకుమార్
-
2 Year Old Girl: రాత్రి సమయంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి.. చివరకు..!
-
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌తో పాటు ఆ స్టార్ హీరోయిన్!
-
Congress-CPI: కాంగ్రెస్-సీపీఐ పొత్తు.. చర్చలు కొనసాగుతున్నాయ్: చాడ వెంకట్‌రెడ్డి
-
Amazon: గ్రేట్ ఇండియన్ సేల్కు అమెజాన్ రెడీ.. వీటిపైనే డీల్స్!