చండీగఢ్‌లో రూ.7,127 ఉంటే.. ఏపీలో మాత్రం రూ.36 వేలెందుకు?

చండీగఢ్‌లో ఒక్కో స్మార్ట్‌మీటర్‌ ధర, నిర్వహణతో కలిసి రూ.7,127, రాజస్థాన్‌లో రూ.7,945గా ఉంటే.. ఏపీలో మాత్రం రూ.36,975గా నిర్ణయించి ప్రజాధనాన్ని లూఠీ చేస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Published : 08 Jun 2023 05:05 IST

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: చండీగఢ్‌లో ఒక్కో స్మార్ట్‌మీటర్‌ ధర, నిర్వహణతో కలిసి రూ.7,127, రాజస్థాన్‌లో రూ.7,945గా ఉంటే.. ఏపీలో మాత్రం రూ.36,975గా నిర్ణయించి ప్రజాధనాన్ని లూఠీ చేస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన సోదరుడు అవినాష్‌రెడ్డి బినామీ సంస్థ షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌కు అడ్డగోలుగా దోచిపెట్టడానికే సీఎం జగన్‌ స్మార్ట్‌ మీటర్ల ముసుగులో కొత్త కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. ఈ కుంభకోణానికి సంబంధించి షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ సంస్థ కడప కార్యాలయంలోనే అంచనాలు తయారు చేశారని, తిరుపతి సీఎండీ ఆయన బృందం ఇందులో పాల్గొని దోపిడీకి ప్రణాళికలు రచించారని పేర్కొన్నారు.  అసలు షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ కార్యాలయంలో తిరుపతి సీఎండీకి ఏం పని? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. ఈ కుంభకోణంలో డిస్కంల సీఎండీలూ భాగస్వాములయ్యారన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు