తెదేపా మినీ మేనిఫెస్టోపై జోన్‌ 1, 2 ల్లో విస్త్రృత స్థాయి సమావేశాలు

మహానాడు వేదికగా భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో తెదేపా ప్రకటించిన మినీ మేనిఫెస్టోపై ఉత్తరాంధ్ర (జోన్‌-1), ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి (జోన్‌-2)జిల్లాల్లో బుధవారం విస్త్రృత స్థాయి సమావేశాలు నిర్వహించారు.

Published : 08 Jun 2023 05:38 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి : మహానాడు వేదికగా భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో తెదేపా ప్రకటించిన మినీ మేనిఫెస్టోపై ఉత్తరాంధ్ర (జోన్‌-1), ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి (జోన్‌-2)జిల్లాల్లో బుధవారం విస్త్రృత స్థాయి సమావేశాలు నిర్వహించారు. సుమారు 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌ఛార్జిల ఆధ్వర్యంలో సమావేశాలు జరిగాయి. మినీ మేనిఫెస్టోలో యువత, మహిళలు, రైతుల కోసం ప్రకటించిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తెదేపా అధినేత చంద్రబాబు 150 రోజుల కార్యాచరణను త్వరలో ప్రకటించనున్న నేపథ్యంలో కార్యకర్తల్లో అవగాహనకు ఈ సమావేశాలు నిర్వహించినట్లు నేతలు వివరించారు. ‘‘ప్రజల సంక్షేమం, అభివృద్ధి తెదేపాతోనే సాధ్యం. పార్టీ అధికారంలోకి రాగానే ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా అమ్మకు వందనం పథకాన్ని అమలు చేస్తాం. ఏడాదికి రూ.15 వేల చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేస్తాం. మహిళలకు మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, నిరుద్యోగ యువతకు ఉద్యోగం వచ్చే వరకు రూ.మూడు వేల భృతి తదితర హామీలు అమలు తప్పక జరుగుతుంది. వీటిపై రూపొందించిన కరపత్రాల్ని ఇంటింటికీ పంచాలి...’’ అని నేతలు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని