పాటుపడ్డది తెదేపా.. ప్రచార యావలో వైకాపా!

తెదేపా హయాంలో పేదల కోసం ఇళ్లు నిర్మిస్తే.. వైకాపా అధికారంలోకి వచ్చి వాటికి పార్టీ రంగులద్ది ప్రచార వస్తువుగా మార్చేసింది.

Updated : 09 Jun 2023 07:07 IST

తెదేపా హయాంలో పేదల కోసం ఇళ్లు నిర్మిస్తే.. వైకాపా అధికారంలోకి వచ్చి వాటికి పార్టీ రంగులద్ది ప్రచార వస్తువుగా మార్చేసింది. నాలుగున్నరేళ్ల కిందట తెలుగుదేశం ప్రభుత్వం గుడివాడలో మల్లాయపాలెం వద్ద 9,812 టిడ్కో గృహాలను నిర్మించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా వాటిని మూలకు పెట్టింది. అలానే వదిలేస్తే గూడులేని పేదల గోస ఇప్పటంతలో తీరదని తెదేపా, వామపక్షాలు పోరాడాయి. దాంతో ప్రభుత్వం కళ్లు తెరిచింది. ప్రతిదీ ప్రచార యావతో చేపట్టే ప్రస్తుత పాలకులు ఈ నిర్మాణాలనూ వదల్లేదు. భవనాలకు వైకాపా జెండాను పోలిన రంగులు వేసి, ఆ ప్రాంగణంలో భారీ వైఎస్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇళ్లను ప్రారంభిస్తామని వాటిని వైకాపా కార్యాలయాల్లా మార్చేశారు. మూడంతస్తుల భవనాలకు కింది నుంచి పైవరకు భారీ ఎత్తున సీఎం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కింది వరుసలోని ఇళ్ల కిటికీల అద్దాలకూ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రాలే అతికించారు. గోడలు ఖాళీ దొరికితే చాలు ఫ్లెక్సీలతో నింపేశారు. ఇంత చేసి.. ఇళ్లలో పూర్తి స్థాయిలో వసతులు అందుబాటులోకి తేలేకపోయారు. ఇళ్లకు నీరిచ్చే ట్యాంకు నిర్మాణంలో ఉంది. కరెంటు సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్‌ పనులూ పూర్తికాలేదు.

ఈనాడు, కృష్ణా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని