ఆయన మా అమ్మకు ఫోన్‌ చేసి ఏడ్చేశారు

ఇటీవల భాజపాలో చేరిన సీనియర్‌ నేత అశోక్‌ చవాన్‌ను ఉద్దేశించి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మహారాష్ట్రకు చెందిన ఒక సీనియర్‌ నేత కాంగ్రెస్‌ను వీడారు. ఆయన మా అమ్మతో మాట్లాడుతూ..‘సోనియాజీ.. వారితో పోరాడే శక్తి నాకు లేదు.

Updated : 19 Mar 2024 04:25 IST

అశోక్‌ చవాన్‌ను ఉద్దేశించి రాహుల్‌ వ్యాఖ్య

దిల్లీ: ఇటీవల భాజపాలో చేరిన సీనియర్‌ నేత అశోక్‌ చవాన్‌ను ఉద్దేశించి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మహారాష్ట్రకు చెందిన ఒక సీనియర్‌ నేత కాంగ్రెస్‌ను వీడారు. ఆయన మా అమ్మతో మాట్లాడుతూ..‘సోనియాజీ.. వారితో పోరాడే శక్తి నాకు లేదు. నేను జైలుకు వెళ్లాలనుకోవడం లేదు. ఇలా మాట్లాడుతున్నందుకు సిగ్గుగా అనిపిస్తోంది’ అని కన్నీటిపర్యంతమయ్యారు’’ అంటూ రాహుల్‌ వ్యాఖ్యానించారు.


‘నేను సోనియాతో భేటీ కాలేదు: అశోక్‌ చవాన్‌

రాహుల్‌ ప్రస్తావించిన సీనియర్‌ నేతను తాను కాదని భాజపా నేత, రాజ్యసభ ఎంపీ అశోక్‌ చవాన్‌ అన్నారు. రాజీనామా తర్వాత తాను సోనియాగాంధీతో భేటీ కాలేదని స్పష్టం చేశారు. ‘‘ఆయన చెప్పింది నా గురించే అయితే.. ఆ మాటలు నిరాధారమైనవి. నేను రాజీనామా చేసేవరకు ఆ విషయం ఎవరికీ తెలియదు. నా నిర్ణయం ప్రకటించే వరకు కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలోనే పని చేశాను. నేను సోనియాగాంధీతో భేటీ కాలేదు. నేను ఆమెతో మాట్లాడి, కన్నీరు పెట్టుకున్నానన్నది నిరాధారమైన వ్యాఖ్య. ఎన్నికలను దృష్టిలోపెట్టుకొని ఈ ప్రకటనలు చేశారు’’ అని ఆ వార్తలను తోసిపుచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని