జగన్‌ను ఎందుకు అరెస్టు చేయరు?

దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై కక్ష గట్టి అరెస్టు చేయించిన కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఎందుకు మినహాయింపు ఇస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు ప్రశ్నించారు.

Published : 30 Apr 2024 05:28 IST

సీపీఎం నేతలు బీవీ రాఘవులు, పి.మధు

ఈనాడు డిజిటల్‌, తిరుపతి: దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై కక్ష గట్టి అరెస్టు చేయించిన కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఎందుకు మినహాయింపు ఇస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు ప్రశ్నించారు. ఐదేళ్లుగా ఆయన బెయిల్‌పై ఉన్నారని గుర్తు చేశారు. ‘ఎన్నికలు - వర్తమాన పరిస్థితి’ అనే అంశంపై తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలో సోమవారం నిర్వహించిన సదస్సులో వారు మాట్లాడారు. ‘రాష్ట్ర విభజన అనంతరం అన్ని పార్టీల ఆమోదంతోనే అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. ప్రారంభానికి పిడికెడు మట్టితో వచ్చిన మోదీ కూడా రాజధాని నిర్మాణం కొనసాగేలా చర్యలు తీసుకోలేదు. అమరావతిలో కబ్జా చేసేందుకు భూములు లేకనే జగన్‌ విశాఖపట్నానికి వెళ్లారు. రేపోమాపో తిరుపతికి వచ్చినా ఆశ్చర్యం లేదు’ అని ఎద్దేవా చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరినాథరెడ్డి, తిరుపతి పార్లమెంట్‌ ఇండియా కూటమి అభ్యర్థి చింతామోహన్‌, తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి పి.మురళి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు