ద్రౌపదీ ముర్ముకే మా ఓటు: మాయావతి

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు మద్దతు ఇస్తున్నట్లు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ప్రకటించారు. అయితే ఇది భాజపా లేదా ఎన్డీయేలను సమర్థించడమో, విపక్ష కూటమిని వ్యతిరేకించడమో కాదని స్పష్టంచేశారు.

Published : 26 Jun 2022 05:09 IST

ఈనాడు, లఖ్‌నవూ: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు మద్దతు ఇస్తున్నట్లు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ప్రకటించారు. అయితే ఇది భాజపా లేదా ఎన్డీయేలను సమర్థించడమో, విపక్ష కూటమిని వ్యతిరేకించడమో కాదని స్పష్టంచేశారు. గిరిజన సమాజాన్ని తమ ఉద్యమంలో ప్రత్యేక భాగంగా పరిగణించి ముర్ముకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో విపక్షాలు తమను సంప్రదించలేదని ఆమె ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఈ నెల 15న కొన్ని పార్టీలను మాత్రమే సమావేశానికి పిలిచి, అభ్యర్థిని ఎంపిక చేశారని విమర్శించారు. ఈ నెల 21న జరిగిన భేటీకి ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ కూడా తమను ఆహ్వానించలేదన్నారు. ఇది ఆ పార్టీల కులతత్వానికి నిదర్శనమని చెప్పారు. తాము ఎన్డీయే లేదా యూపీఏల్లో భాగస్వాములం కాదన్నారు. దళితులకు నాయకత్వం వహించే సిసలైన జాతీయపార్టీ బీఎస్పీ ఒక్కటేనని పేర్కొన్నారు. 

ఝార్ఖండ్‌ సీఎం మద్దతు కోరిన ద్రౌపది

జేఎంఎం అధినేత, ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరెన్‌కు ఫోన్‌ చేసిన ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము.. తనకు మద్దతివ్వాలని కోరారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ కూటమిలో జేఎంఎం భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు