కోటలు కూలాక.. మరమ్మతులపై దృష్టి!

సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటలుగా భావించే రెండు లోక్‌సభ స్థానాలను ఇటీవలి ఉప ఎన్నికల్లో భాజపా ఎగరేసుకుపోయాక ‘సైకిల్‌’ పార్టీకి జ్ఞానోదయమైంది. పార్టీకి సంబంధించిన జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయి కార్యవర్గాలన్నిటినీ అధినేత అఖిలేశ్‌ ఆదివారం రద్దు చేశారు.

Published : 04 Jul 2022 04:42 IST

సమాజ్‌వాదీ పార్టీ కార్యవర్గాలన్నీ రద్దు చేసిన అఖిలేశ్‌

లఖ్‌నవూ: సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటలుగా భావించే రెండు లోక్‌సభ స్థానాలను ఇటీవలి ఉప ఎన్నికల్లో భాజపా ఎగరేసుకుపోయాక ‘సైకిల్‌’ పార్టీకి జ్ఞానోదయమైంది. పార్టీకి సంబంధించిన జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయి కార్యవర్గాలన్నిటినీ అధినేత అఖిలేశ్‌ ఆదివారం రద్దు చేశారు. యువజన, మహిళా విభాగాలు కూడా రద్దయ్యాయి. తక్షణం అమలులోకి వచ్చిన ఈ తీవ్ర నిర్ణయానికి కారణం ఏమిటన్నది బాహాటంగా చెప్పకపోయినా.. రాంపుర్‌, ఆజంగఢ్‌ లోక్‌సభ స్థానాల్లోనూ ఎదురైన ఓటమితో పార్టీని పూర్తిగా పునర్వ్యవస్థీకరించాలని అఖిలేశ్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్‌ ఉత్తమ్‌ మటుకు తన స్థానంలో కొనసాగుతారని పార్టీ ప్రకటించింది. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి భాజపాను ఎదుర్కొనేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యే ప్రక్రియలో భాగమే ఈ నిర్ణయమని సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని