Amit Shah: రామాలయానికి వ్యతిరేకంగానే నల్ల దుస్తుల్లో నిరసనలు

అధిక ధరలు, నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం దేశ వ్యాప్తంగా నిర్వహించిన నిరసనలు.. ఓ వర్గాన్ని సంతృప్తిపరిచే రాజకీయాల్లో భాగంగా చేపట్టినవేనని కేంద్ర హోంమంత్రి, భాజపా అగ్రనేత అమిత్‌ షా ఆరోపించారు. దిల్లీలో శుక్రవారం

Updated : 06 Aug 2022 03:46 IST

కాంగ్రెస్‌పై అమిత్‌ షా ఆరోపణ

దిల్లీ: అధిక ధరలు, నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం దేశ వ్యాప్తంగా నిర్వహించిన నిరసనలు.. ఓ వర్గాన్ని సంతృప్తిపరిచే రాజకీయాల్లో భాగంగా చేపట్టినవేనని కేంద్ర హోంమంత్రి, భాజపా అగ్రనేత అమిత్‌ షా ఆరోపించారు. దిల్లీలో శుక్రవారం ఆయన పార్లమెంటు వద్ద విలేకరులతో మాట్లాడుతూ...‘‘2020 ఆగస్టు 5న అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. దానికి వ్యతిరేకమని సందేశమిచ్చేందుకే రెండేళ్ల తర్వాత అదే రోజును కాంగ్రెస్‌ పార్టీ నల్ల దుస్తులతో నిరసనలకు ఎంచుకుంద’’ని పేర్కొన్నారు. కోట్ల మంది ప్రజల మనోభావాలతో ముడిపడిన 550 ఏళ్ల నాటి వివాదాన్ని ప్రధాని మోదీ శాంతియుతంగా పరిష్కరించారని అమిత్‌ షా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని