చిత్తూరులో 14 మంది తెదేపా నేతల అరెస్టు

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం వేపనపల్లె గ్రామంలో గురువారం ఎమ్మెల్యే బాబు పర్యటన నేపథ్యంలో జరిగిన పరిణామాలపై పోలీసులు మొత్తం 14 మందిని

Published : 06 Aug 2022 04:28 IST

చిత్తూరు లీగల్‌, పూతలపట్టు, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం వేపనపల్లె గ్రామంలో గురువారం ఎమ్మెల్యే బాబు పర్యటన నేపథ్యంలో జరిగిన పరిణామాలపై పోలీసులు మొత్తం 14 మందిని అరెస్టు చేశారు. వీరిని శుక్రవారం ఉదయం రహస్యంగా జిల్లా కేంద్రమైన చిత్తూరుకు తరలించారు. 2 కేసుల్లో అరెస్టు చూపి సాయంత్రం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. రాత్రి 12.30 గంటల వరకు విచారణ కొనసాగింది. తెదేపా నేతలకు కోర్టు 18 వరకు రిమాండ్‌ విధించింది. ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి ప్రభుత్వ పథకాల గురించి ప్రశ్నించడం.. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం.. అనంతర పరిణామాల కారణంగా పది మందిని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో వైకాపా మండల కన్వీనర్‌ శ్రీకాంత్‌రెడ్డి కారుపై రాళ్ల దాడి చేశారనే కేసులో.. గురువారం అర్ధరాత్రి తెదేపా మండల కన్వీనర్‌ దొరబాబు, మాజీ కన్వీనర్‌ చంద్రమౌళి, గోపాలనాయుడు, గుణలను అదుపులోకి తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని