కాలయాపనకు ఎత్తుగడ?

గతంలో తెదేపా అధినేత చంద్రబాబును తక్షణం కమిషన్‌ ముందు హాజరుకావాలని ఆదేశించిన మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ.. వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ను

Published : 07 Aug 2022 05:23 IST

వంగలపూడి అనిత విమర్శ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: గతంలో తెదేపా అధినేత చంద్రబాబును తక్షణం కమిషన్‌ ముందు హాజరుకావాలని ఆదేశించిన మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ.. వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ను మాత్రం ఆ విధంగా ఎందుకు ఆదేశించలేదని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. రాష్ట్రంలోని మహిళలు అందరూ ఛీ కొడుతుంటే... తీరిగ్గా రెండు రోజుల తర్వాత లేఖ రాస్తారా అని శనివారం ట్విటర్‌లో మండిపడ్డారు. ‘‘ ఇది చిత్తశుద్ధితో చేసిన పనికాదు. గోరంట్ల మాధవ్‌ను వైకాపా నుంచి ఎందుకు బహిష్కరించలేదని మహిళలు జగన్‌రెడ్డిని ప్రశ్నిస్తుండడంతో.... లేఖ పేరుతో కాలయాపన చేయడానికి వేసిన ఎత్తుగడ.  ప్రతిపక్షంలోని మహిళలందరూ మహిళా కమిషన్‌ నిర్లిప్తతను ఎండగడుతుండడంతో గత్యంతరం లేక నింపాదిగా విచారణ జరపాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇది రాష్ట్ర మహిళలను నయవంచనకు గురి చేయడమే...’’ అని అనిత ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని