జయశంకర్‌ ఆశించిన తెలంగాణ ఇదేనా?: బక్కని

‘కుళ్లిన అన్నం, పాచిపోయిన కూరలు తిని ఆసుపత్రి పాలైన పసిబిడ్డలు, విద్యార్థుల ఆకలి కేకలు.. ఆచార్య జయశంకర్‌ ఆశించిన తెలంగాణ ఇదేనా’ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు బక్కని

Published : 07 Aug 2022 05:13 IST

ఈనాడు, హైదరాబాద్‌: ‘కుళ్లిన అన్నం, పాచిపోయిన కూరలు తిని ఆసుపత్రి పాలైన పసిబిడ్డలు, విద్యార్థుల ఆకలి కేకలు.. ఆచార్య జయశంకర్‌ ఆశించిన తెలంగాణ ఇదేనా’ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు ప్రశ్నించారు. జయశంకర్‌ జయంతి సందర్భంగా శనివారం ఎన్టీఆర్‌ భవన్‌లో ఆయనకు నివాళులర్పించి బక్కని మాట్లాడారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు నెలకొల్పిన గురుకుల విద్యాలయ వ్యవస్థను కేసీఆర్‌ నాశనం చేస్తున్నారని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతిగృహాల్లో నాసిరకం భోజనం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని