Raghurama: రాజధాని మార్చే హక్కు లేదని విజయసాయి చెప్పకనే చెప్పారు: రఘురామ

రాజధానిని మార్చే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తన తీరుతో చెప్పకనే చెప్పారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. తాము ఏదో పిచ్చి పని చేసినందున.. పార్లమెంట్‌

Updated : 09 Aug 2022 06:50 IST

ఈనాడు, దిల్లీ: రాజధానిని మార్చే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తన తీరుతో చెప్పకనే చెప్పారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. తాము ఏదో పిచ్చి పని చేసినందున.. పార్లమెంట్‌ ద్వారా ఆ హక్కును ప్రసాదించమని రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రైవేటు మెంబర్‌ బిల్లు ప్రవేశపెట్టారని ఎద్దేవా చేశారు. దిల్లీలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎవరైనా తాత్కాలికంగా నిర్మాణాలు చేపట్టి, ఇతర ప్రాంతానికి వెళితే వెళ్లొచ్చు కానీ అమరావతిని రాజధానిగా కదిలించలేరన్నారు. పార్లమెంటు వ్యవస్థ మనుగడలోకి వచ్చినప్పటి నుంచి కేవలం రెండు ప్రైవేటు మెంబర్‌ బిల్లులే  ఆమోదం పొందాయని గుర్తుచేశారు. నీతిఆయోగ్‌ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి ఫలానాది కావాలని కోరలేదని ఆయన విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం నిధుల ఊసే ఎత్తలేదని మండిపడ్డారు. మాతృభాషలో విద్యాబోధన చేయాలని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే ఆ అవకాశమే లేకుండా ప్రాథమిక పాఠశాలలను ఎత్తివేసే పనిలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఉందని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని