ఎంపీ మాధవ్‌పై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు

వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియో ఘటనపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసినట్లు తెదేపా లోక్‌సభా పక్షనేత కె.రామ్మోహన్‌నాయుడు తెలిపారు. దిల్లీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మాధవ్‌ వీడియో దేశమంతా

Published : 10 Aug 2022 05:47 IST

రామ్మోహన్‌నాయుడు వెల్లడి

ఈనాడు, దిల్లీ: వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియో ఘటనపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసినట్లు తెదేపా లోక్‌సభా పక్షనేత కె.రామ్మోహన్‌నాయుడు తెలిపారు. దిల్లీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మాధవ్‌ వీడియో దేశమంతా చూసినా వైకాపాలో చలనం లేదు. పైగా దాన్ని సమర్థించేలా పార్టీ వైఖరి ఉంది. ఎంపీని సస్పెండ్‌ చేస్తామని మొదట లీకులిచ్చిన పార్టీ.. ఇప్పుడు భయపడుతోంది. మాధవ్‌పై చర్య తీసుకుంటే, అలాంటి వీడియోలున్న మంత్రులతో పాటు సగానికిపైగా వైకాపా నేతలపైనా స్పందించాల్సి వస్తుందని సజ్జల భయపడుతున్నారా?’ అని ప్రశ్నించారు. ఆ వీడియో లీకేజీ వెనుక తెదేపా పాత్ర లేదని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ మాట్లాడుతూ అమరావతి రాజధాని ఎక్కడికి వెళ్లదని, విజయసాయిరెడ్డి పరోక్షంగా ఆ విషయాన్ని ఒప్పుకొనే రాజ్యాంగ సవరణకు ప్రైవేటు మెంబర్‌ బిల్లు పెట్టారన్నారు. ఆయన మోదీ, నిర్మలా సీతారామన్‌ను ఎందుకు రహస్యంగా కలిశారో చెప్పాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని