మునుగోడులో గులాబీ జెండా ఎగురుతుంది

మునుగోడు ఉపఎన్నికల్లో తెరాస భారీ మెజారిటీతో ఘన విజయం సాధిస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నల్గొండ జిల్లా అంటేనే తెరాసకు కంచుకోట అని, గతంలో జరిగిన హుజూర్‌నగర్‌, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో హేమాహేమీలను

Published : 11 Aug 2022 06:11 IST

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ఈనాడు, హైదరాబాద్‌: మునుగోడు ఉపఎన్నికల్లో తెరాస భారీ మెజారిటీతో ఘన విజయం సాధిస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నల్గొండ జిల్లా అంటేనే తెరాసకు కంచుకోట అని, గతంలో జరిగిన హుజూర్‌నగర్‌, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో హేమాహేమీలను తెరాస ఓడించిందని చెప్పారు.స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్‌ దోమలగూడలోని భారత్‌ స్కౌట్స్‌, గైడ్స్‌ మోడల్‌ హైస్కూల్‌లో బుధవారం జరిగిన వన మహోత్సవంలో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘‘భాజపా దుందుడుకు విధానాలకు మునుగోడు ఉపఎన్నిక సమాధానం చెబుతుంది’’ అని కవిత తెలిపారు. ‘చెట్టు ఎలా బాధ పడుతుంది?’ అన్న అంశంపై పాఠశాల ఉపాధ్యాయుడు పరాశరన్‌ పాడిన పాటకు విద్యారులతో పాటు కవిత కూడా బిగ్గరగా కోరస్‌ పాడటంతో వారి ఉత్సాహం రెట్టింపైంది. ఈ సందర్భంగా కవిత జాతీయ జెండాలను విద్యారులకు పంపిణీ చేశారు. మువ్వన్నెల బెలూన్లను ఎగురవేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని