భాజపా సాలు దొర-సెలవు దొర ప్రచారానికి ఈసీ బ్రేక్‌

 తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా భాజపా చేపట్టిన సాలు దొర-సెలవు దొర ప్రచారానికి కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్‌ వేసింది. పార్టీ ఓ పక్క ఇలా ప్రచారం చేస్తూనే మరోపక్క ఇందుకు అనుమతి ఇవ్వాలని.. కేంద్ర ఎన్నికల

Published : 12 Aug 2022 05:58 IST

ఈనాడు, దిల్లీ; గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే:  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా భాజపా చేపట్టిన సాలు దొర-సెలవు దొర ప్రచారానికి కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్‌ వేసింది. పార్టీ ఓ పక్క ఇలా ప్రచారం చేస్తూనే మరోపక్క ఇందుకు అనుమతి ఇవ్వాలని.. కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన మీడియా సర్టిఫికేషన్‌ కమిటీని కోరగా నిరాకరించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. రాజకీయ పార్టీలకు చెందిన నేతలను కించపరిచే విధంగా ఉండే పోస్టర్లు, ఫొటోలు, రాతలు నిబంధనావళికి విరుద్ధమని, అందువల్ల ఆ విధానాన్ని ప్రోత్సహించే ఎలాంటి ప్రచారానికీ అనుమతి ఇవ్వబోమని ఎన్నికల సంఘం స్పష్టం చేసినట్లు తెలిసింది. నిబంధనలకు లోబడే భాజపా ప్రచారానికి మీడియా సర్టిఫికేషన్‌ కమిటీ అనుమతి నిరాకరించినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి గురువారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ సాలు దొర-సెలవు దొర  ప్రచారాన్ని నిలిపేయాలని ఎన్నికల సంఘం ఆదేశించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్‌ లేదని, అలాంటి సమయంలో ఎన్నికల సంఘం ఎందుకు జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని