కరోనాతో మృతిచెందిన పాత్రికేయుల కుటుంబాలకు నేటికీ అందని సాయం

కరోనాతో మృతి చెందిన పాత్రికేయుల కుటుంబాలకు నేటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థికసాయం అందలేదని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ఆరోపించారు. వైకాపా

Published : 15 Aug 2022 06:03 IST

సీఎం జగన్‌కు తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: కరోనాతో మృతి చెందిన పాత్రికేయుల కుటుంబాలకు నేటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థికసాయం అందలేదని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అక్రిడిటేషన్‌లు ఇవ్వకుండా పాత్రికేయులను ఇబ్బందిపెడుతోందని మండిపడ్డారు. ఈ మేరకు సీఎం జగన్‌కు ఆదివారం ఆయన బహిరంగ లేఖ రాశారు. ‘‘విధి నిర్వహణలో కెమెరామెన్లు, ఫొటోగ్రాఫర్లు మృతి చెందితే వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సాయం అందించడం లేదు. తెదేపా హయాంలో 24వేల మందికి అక్రిడిటేషన్‌ కార్డులిస్తే.. వైకాపా ప్రభుత్వం కేవలం 8వేల మందికే ఇచ్చింది. అక్రిడిటేషన్లు ఉన్న పాత్రికేయుల పిల్లలకు గతంలో ప్రైవేట్‌ పాఠశాలలు ఫీజులో 50 శాతం రాయితీ ఇచ్చేవి. మూడేళ్లుగా ఈ పథకం అటకెక్కింది. గతంలో మంజూరు చేసిన ఇళ్ల స్థలాలను రద్దు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేయాలి’’ అని లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని