మద్యనిషేధంపై మాట తప్పడమే జగన్‌ విశ్వసనీయతా?

రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాకే మళ్లీ ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్‌...దానిపై వచ్చే ఆదాయాన్ని 15ఏళ్లకు తాకట్టుపెట్టి రూ.25 వేల కోట్ల అప్పు తెచ్చారని, విశ్వసనీయత అంటే

Published : 17 Aug 2022 03:51 IST

నిమ్మల రామానాయుడు ధ్వజం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాకే మళ్లీ ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్‌...దానిపై వచ్చే ఆదాయాన్ని 15ఏళ్లకు తాకట్టుపెట్టి రూ.25 వేల కోట్ల అప్పు తెచ్చారని, విశ్వసనీయత అంటే అదేనా? అని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జగన్‌రెడ్డి మాట్లాడినవన్నీ అసత్యాలే. భవన నిర్మాణ కార్మికులను ఏదో ఉద్ధరించినట్లు జగన్‌ మాట్లాడారు. ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్న విషయం మర్చిపోయారా? వైకాపా నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, గుత్తేదారు శేఖర్‌రెడ్డి అనుయాయులు కలసి ఇసుకలో ఏడాదికి రూ.5 వేల కోట్లు దోచుకున్నది వాస్తవం కాదా? జగన్‌రెడ్డి మేనిఫెస్టో ప్రకారం ఏడాదికి 5లక్షల ఇళ్ల చొప్పున ఇప్పటికే 15 లక్షల ఇళ్లు నిర్మించాల్సి ఉంది. కానీ ఐదు ఇళ్లే నిర్మించారని కేంద్రమే చెప్పింది’’ అని రామానాయుడు విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని