మోదీవి బూటకపు వాగ్దానాలు: ఉత్తమ్‌

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇప్పటి వరకు దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో

Published : 18 Aug 2022 05:11 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇప్పటి వరకు దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.ఆయన బూటకపు వాగ్దానాలు చేసేందుకు స్వాతంత్య్ర దినోత్సవాలను దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఎనిమిదేళ్లుగా ఇది సాగుతోందన్నారు. 2016లో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, అందరికీ ఇళ్లు అన్నారని గుర్తు చేశారు. ఇలాంటివి ఎన్నో హామీలు అమలు ఊసే లేకుండా ఉండిపోయాయని అన్నారు. అవినీతి గురించి మాట్లాడుతున్న ప్రధాని మోసగాళ్లపై చర్యలు తీసుకోకుండా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యం చేసుకొని దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తున్నారని విమర్శించారు. స్వతంత్య్ర దినోత్సవం సందర్భంగా గుజరాత్‌ ప్రభుత్వం 11 మంది అత్యాచార  దోషులను విడుదల చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఉత్తమ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని